ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టాల పంపిణీలో ఘర్షణ..ఓ కుటుంబంపై వైకాపా శ్రేణుల దాడి - clash at house sites distribution

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని లత్తవరం గ్రామంలో.. 'జగనన్న పేదల ఇళ్ల పట్టాల' పంపిణీ కార్యక్రమం వివాదానికి దారి తీసింది. సర్వే నెంబర్ 253/1లోని ఓ దళిత కుటుంబానికి చెందిన అసైన్​మెంట్ భూమిలో.. ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

clash at distribution of house sites in uravakonda at ananthapur
పట్టాల పంపిణీలో ఘర్షణ.. ఇళ్ల స్థల నిర్వాసితులపై వైకాపా శ్రేణుల దాడి

By

Published : Dec 30, 2020, 5:43 PM IST

పట్టాల పంపిణీలో ఘర్షణ.. ఇళ్ల స్థల నిర్వాసితులపై వైకాపా శ్రేణుల దాడి

అనంతపురం జిల్లా ఉరవకొండలోని లత్తవరం గ్రామంలో 'జగనన్న పేదల ఇళ్ల పట్టాల' పంపిణీ కార్యక్రమంలో వివాదం చెలరేగింది. లత్తవరం గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 253/1 లో.. మొత్తం 3 ఎకరాల 20 సెంట్ల స్థలం ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు చెందినది. అందులో ముగ్గురు వ్యక్తులకు చెందిన భూమి.. పట్టాల సేకరణలో పోగా మరికొంత స్థలం మిగిలింది.

డబ్బులు చెల్లించకుండా భూసేకరణ..

భూమి కోల్పోయిన భాగానికి గాను.. ప్రభుత్వం ముగ్గురికి రూ.23లక్షలు చెల్లించింది. అయితే డబ్బులు అందని ఆనంద్, అతని కుమార్తె రోజా భూసేకరణలో కోల్పోయిన భూమి తమదేనని.. తమకు డబ్బులు చెల్లించకుండా ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. కుటుంబంలోని మిగిలిన సభ్యులు ఓరల్ అగ్రిమెంట్ల ద్వారా భూ సమస్యను పరిష్కరించుకుని.. వాటికి పట్టాదారు పాసు పుస్తకాలు పొందినట్లు తెలిపారు. ఈ విషయమై.. తాము ఇప్పటికే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించామని వారు అన్నారు.

ఆనంద్ కుటుంబంపై వైకాపా శ్రేణుల దాడి

వివాదం పెద్దది కావడంతో వైకాపా శ్రేణులు అక్కడకు చేరుకుని.. ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అనవసరంగా అడ్డుకుంటున్నారని ఆనంద్ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు వారిని అక్కడనుండి ఉరవకొండ పోలీస్ స్టేషన్​కు తరలించారు. అయితే పట్టాల పంపిణీ కోసం వచ్చిన తమపై దుర్భాషలాడి.. తమ విధులకు ఆటంకం కలిగించారని లత్తవరం గ్రామ వాలంటీర్.. ఆనంద్ కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

దళితులకు చెందిన అసైన్​మెంట్ భూమి.. ఇళ్ల కోసం కేటాయించడం, ఆ వివాదం కుటుంబ సభ్యుల మధ్య పరిష్కారం కాకపోవడం అధికారులకు తలనొప్పిగా మారి తీవ్ర వివాదానికి దారి తీసింది.

ఇదీ చదవండి:

తాడిపత్రి ఘర్షణ కేసు: ఐదుగురు వైకాపా నేతల అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details