అనంతపురం జిల్లా హిందూపురంలో రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. జీవో 10ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీలర్ల ఆందోళనతో బియ్యం సరఫరా నిలిచిపోయింది. కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలను అందించామని, 9 నెలలుగా రావలసిన కమీషన్ ఇవ్వాలని డీలర్లు కోరారు. జీవోను రద్దు చేయాలని, కరోనాతో మృతిచెందిన స్టోర్ డీలర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి: రేషన్ డీలర్లు - హిందూపురం వార్తలు
జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని పౌరసరఫరాల సంస్థ రేషన్ డీలర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా హిందూపురంలో ఆందోళనకు దిగారు. 9 నెలలుగా రావలసిన కమీషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
సివిల్ సప్లై డీలర్లు ఆందోళన