అనంత, కడప జిల్లాల్లో సీఐటీయూ ఆందోళన - ananthapuram
కార్మిక చట్టాల సవరణతో కార్మికుల హక్కులకు భంగం వాటిల్లుతుందని సీఐటీయూ నాయకులు అన్నారు. కేంద్ర నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళన ఉద్ధృతం చేస్తామని తెలిపారు. కేంద్ర వైఖరికి నిరసనగా కడప, అనంతపురం జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు.
కార్మిక చట్టాల సవరణపై కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ అనంతపురం, కడప జిల్లాలో సీఐటీయూ నాయకులు ఆందోళన చేపట్టారు. కార్మిక చట్టాలను సవరించాలన్న కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ... దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా అనంతపురం కదిరిలో అంగన్వాడి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. మైదుకూరులోని అంబేద్కర్ విగ్రహం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. యూనియన్ నాయకులు భారతీయ జనతా పార్టీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక హక్కులను కాపాడాలని కోరారు.