మున్సిపాలిటీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ... సీఐటీయూ నాయకులు మున్సిపల్ కార్మికులతో కలిసి అనంతపురంలో ధర్నా చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా మురికివాడల్లో... ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేస్తున్నా ప్రభుత్వాలు గుర్తించడం లేదని మండిపడ్డారు. వేతనాలు పెంచడంలో ఆలస్యం చేస్తూ కార్మికులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పనులు చేస్తున్నా... శాశ్వత ఉద్యోగులుగా గుర్తించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ ఆగస్టు4న కార్మికులుంతా ఐక్యంగా సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ధర్నా - అనంతపురం తాజా వార్తలు
మున్సిపాలిటీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ... సీఐటీయూ నాయకులు మున్సిపల్ కార్మికులతో కలిసి అనంతపురంలో ధర్నా చేపట్టారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ధర్నా
ఇదీ చదవండి: