అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని నాగ సముద్రం గ్రామంలో బయటపడిన నకిలీ పాసు పుస్తకాల వ్యవహారంపై సీఐడీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. 2014- 2016లో 72 నకిలీ పాసు పుస్తకాల గుర్తించి సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా సీఐడీ సీఐ ప్రభాకర్...గుంతకల్లు డిప్యూటీ తహసీల్దార్ రామును విచారించారు.
నకిలీ పాసు పుస్తకాల వ్యవహారంలో అప్పటి తహసీల్దార్ ఎల్లమ్మ పాత్రపై ఆరా తీశారు. భూమి లేకున్నా అనధికారికంగా పాస్ బుక్లు మంజూరు చేశారా? వాటితో ఏమైనా బ్యాంక్ రుణాలు పొందారా? అన్న కోణంలో విచారణ చేసినట్లుగా రెవెన్యూ సిబ్బంది ద్వారా తెలుస్తోంది. ఈ కేసు విషయంలో ఇప్పటికే పలుమార్లు సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు.