CI Ram Caught Red Handed by ACB While Taking Bribes: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం సీఐ రాము.. 25 వేల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. విద్యాసంస్థల యజమాని నుంచి డబ్బులు తీసుకుంటుండగా.. అవినీతి నిరోదక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న మల్లికార్జున్ అనే వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. కాగా.. బెయిల్ ఇవ్వాలంటే 75 వేల రూపాయలు లంచం ఇవ్వాలని సీఐ రాము.. నిందితుడిని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా నిందితుడు సీఐకి 50 వేలు చెల్లించారు. మిగతా 25 వేల రూపాయల కోసం వేధిస్తుండటంతో.. ఆయన అవినీతి నిరోధక శాఖకు సమాచారమిచ్చారు.
ఏసీబీ వలలో బుక్కరాయసముద్రం సీఐ.. రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
CI Ram Caught Red Handed by ACB While Taking Bribes: అనంతపురం జిల్లాలో ఓ సీఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆదేశాలిచ్చింది. బెయిల్ ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని సీఐ.. నిందితుడిని డిమాండ్ చేయడంతో..ఆయన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
బుక్కరాయసముద్రం సీఐ రాము
ఫిర్యాదుపై స్పందించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు.. శనివారం రాత్రి వల వేసి.. సీఐ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. సీఐ రాముకి సహకరించిన మరో కానిస్టేబుల్‌ని కూడా అరెస్ట్ చేశారు. లంచం తీసుకుంటుండగా పట్టుబడిన సీఐ రాము.. గుత్తిలో జరిగిన ఓ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మేల్యే వెంకట్రామిరెడ్డిని.. ఆయన సమక్షంలోనే పొగడ్తలతో ముంచెత్తి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మేల్యేని సింహంతో పోలుస్తూ సీఐ రాము చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఇవీ చదవండి: