అనంతపురం జిల్లా తాడిమరి మండలం మరిమాకులపల్లి గ్రామం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరద ముంపునకు గురవుతోంది. ప్రస్తుతం గ్రామంలోకి నీరు రావడం వల్ల అధికారులు గృహాలను తొలగించేందుకు సిద్ధమయ్యారు. దీన్ని వ్యతిరేకించిన స్థానికులు నీటిలో దిగి నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్థానిక ఆర్డీవో, డీఎస్పీ, పోలీసులు గ్రామానికి చేరుకుని గ్రామస్థులతో చర్చించారు. అయితే ముంపు పరిహారం ఇవ్వాలని గ్రామస్థులు నీటిలోకి దిగి జల దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
చిత్రావతి ముంపు బాధితులకు న్యాయం చేయాలి: గ్రామస్థులు - నీటిలో దిగి మరి మాకులపల్లి గ్రామస్థుల నిరసన
చిత్రావతి ముంపు బాధితులకు న్యాయం చేయాలని మరి మాకులపల్లి గ్రామస్థులు డిమాండ్ చేశారు. గ్రామంలోకి నీరు రావడం వల్ల గృహాలను తొలగించేందుకు అధికారులు రావడం వల్ల స్థానికులు నీటిలోకి దిగి నిరసన తెలిపారు.
చిత్రావతి ముంపు బాధితులకు న్యాయం చేయాలి: గ్రామస్థులు