ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిక్కుకుని 'చిక్కిన' చిరుత - konaapuram

వేటాడటానికి వచ్చిన చిరుత... పంటను రక్షించే కంచెలో చిక్కుకుంది. అది చూసిన గ్రామస్థులు అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన అధికారులు.. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. జంతువులను పట్టుకునే సామగ్రిని మాత్రం మరచిపోయారు. అప్పుడు నాలుక కరుచుకొని మళ్లీ 100 కిలోమీటర్లు వెనక్కి వెళ్లారు. చివరికి బోను తెచ్చి బంధించారు.

కంచెలో చిక్కుకున్న చిరుత

By

Published : Mar 1, 2019, 3:21 PM IST

అనంతపురం జిల్లా పెనుగొండ మండలం కోనాపురం రైతు వెంకటనారాయణ... ఉదయాన్నే పొలానికి వెళ్లాడు. పంటను రక్షించేందుకు ఏర్పాటు చేసిన కంచెలో ఓ జంతువు ఇరుక్కుపోయిన సంగతి చూశాడు. కొంచెం దగ్గరికెళ్లాడు. పిల్లేమో అనుకున్నాడు. ఇంకాస్త దగ్గరికెళ్తేగాని అర్థం కాలేదు అది చిరుతపులని.

చిక్కుకుని 'చిక్కిన' చిరుత
సమీపంలో చిరుతను చూసిన వెంకటనారాయణకు... గొంతులోని ప్రాణం గుండెలోకి జారింది. పరుగుపరుగున గ్రామానికి వెళ్లి... కంచెలో చిరుత ఇర్కుపోయి ఉందని చెప్పాడు. వెంటనే గ్రామస్థులు అక్కడకు చేరుకొని చిరుత ఉందని నిర్ధరించుకున్నారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. కొన్ని గంటలు తర్వాత అక్కడకు వచ్చిన అటవీ శాఖాధికారులు చిరుతను చూసి పట్టుకుందామని సిద్ధమయ్యారు. ఆ అడవి మృగాన్ని బంధించి తమతో తీసుకెళ్లే సామగ్రి తీసుకురాలేదన్న సంగతి అప్పుడు గుర్తించారు. తప్పు సరిదిద్దుకుని... మళ్లీ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీశాఖ కార్యాలయానికి తిరిగివెళ్లారు.
చిక్కుకుని 'చిక్కిన' చిరుత
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహించిన ప్రజలు... ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారంటూ నిలదీశారు. చివరికి బోను తీసుకొచ్చి చిరుతను పట్టుకున్నారు. దాంతోగ్రామస్థులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
కంచెలో చిక్కుకున్న చిరుత

ABOUT THE AUTHOR

...view details