ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత అని త్రిదండి చిన జీయర్ స్వామి అన్నారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడుల అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతపురంలోని శ్రీ సెవెన్ కన్వెన్షన్ హాలులో ఆలయ ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆలయాల భద్రతకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా అందరం నష్టపోవాల్సి వస్తుందన్నారు. దేవుళ్ల చరిత్రను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు.
'ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత' - ఆలయాలపై దాడుల గురించి చిన జీయర్
దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని త్రిదండి చిన జీయర్ స్వామి చెప్పారు. ఆలయాలపై జరుగుతున్న దాడులను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో పర్యటిస్తున్నామన్నారు.
'ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత'