అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులు ఆధార్ అప్‌డేట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రేషన్ కార్డులో పేర్లు ఉన్న లబ్ధిదారులంతా ఈ-కేవైసీ నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయని చెప్పిన మేరకు.. ప్రజలు బారులు తీరారు.
పలు ప్రభుత్వ పథకాల కోసం చిన్న పిల్లల ఆధార్ అప్‌డేట్ ఉంటేనే లబ్ధి చేరుకుందనటంతో ఆధార్ కేంద్రాల వద్ద చిన్నపిల్లలతో కలసి అర్ధరాతి నుంచే ప్రజలు బారులు తీరారు. మండల కేంద్రంలోని పలు గ్రామాల నుంచి తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకొచ్చి.. మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రహరీ చుట్టూ అర్ధరాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు.