ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒకే కుటుంబంలో పదిహేను రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి.. - Family members became orphans after the death of a family member in Madakashir

కరోనా ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రోజుల వ్యవధిలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. వారిలో ఇద్దరు వైరస్‌కాటుకు బలయ్యారు. కుటుంబ పెద్దలను కోల్పోయి...ఐదుగురు చిన్నారులతో ఓ తల్లి దిక్కుతోచని పరిస్థితిలో నిలబడింది.

children
అనాథలుగా మారిన పిల్లలు

By

Published : Jun 15, 2021, 3:23 PM IST

అనంతపురం జిల్లా మడకశిరలో ఓ కుటుంబంలో.. పదిహేను రోజుల వ్యవధిలో అన్న, తమ్ముడు, తమ్ముని భార్య ప్రాణాలు కోల్పోయారు. 40 ఏళ్ల మహేష్ పెట్రోల్ బంక్ లో పని చేసేవాడు. కరోనా బారినపడి మే 16వ తేదీన ప్రాణాలు విడిచాడు. బాధ తట్టుకోలేక మరుసటి రోజు మహేశ్‌ అన్న నాగరాజు గుండెపోటుతో మరణించాడు. సోదరులైన కుటుంబ పెద్దలిద్దరినీ కోల్పోయి తీవ్ర బాధలో ఉన్న కుటుంబంలో కరోనా మరోసారి విషాదం నింపింది. కొవిడ్‌ కారణంగా మహేష్ భార్య వరలక్ష్మి ఈ నెల మొదటి వారంలో ప్రాణాలు విడిచింది.

అనాథలుగా మారిన పిల్లలు

మహేశ్‌, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన వీరిద్దరినీ ప్రస్తుతం మహేశ్‌ వదిన చూసుకుంటోంది. ఆమెకు ముగ్గురు కన్నపిల్లలు ఉన్నారు. భర్తను, మరిదిని, తోటి కోడలను కోల్పోయి....తీవ్ర విషాదంలో ఉన్న ఆమె.....ఐదుగురు పిల్లల భవిష్యత్‌పై బెంగ పెట్టుకుంది. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండీ..మట్టిలో దాచిన మద్యం బిందె పట్టివేత.. ఒకరు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details