ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి - పాలసముద్రం చెరువు వార్తలు

అనంతపురం జిల్లా పాలసముద్రంలో ఇద్దరు చిన్నారులు చెరువులో పడి మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

children died
చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

By

Published : Sep 10, 2020, 8:04 AM IST

అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం చెరువులో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పాలసముద్రం గ్రామానికి చెందిన పునీత్, హిందూపురం రూరల్ మండలం వేములపల్లి గ్రామానికి చెందిన విజయ్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ చెరువు నీటి గుంతలో పడి మృతి చెందారు. కరోనా సెలవుల కారణంగా విజయ్ బంధువుల ఇంటికి గత ఆదివారం వచ్చాడు. చిన్నారులు ఆడుకుంటూ చెరువులో పడి మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు వివవరించారు.

ABOUT THE AUTHOR

...view details