అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం నాయనవారిపల్లిలో చిన్నారుల అస్వస్థత కలకలం రేపింది. ఆదివారం పాఠశాలకు సెలవు కావటంతో ఆడుకునేందుకు చిన్నారులు ఊరికి సమీపంలోని అడవిలోకి వెళ్లారు. అక్కడ అడవి ఆముదం కాయలను చూసిన పిల్లలు తినే పండ్లుగా భావించి తిన్నారు. కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలు కాగా...ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. పిల్లల పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం కదిరికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.
అడవి ఆముదం కాయలను తిన్నారు...అస్వస్థతకు గురయ్యారు - ananthapuram
అనంతపురం జిల్లా నాయనవారిపల్లెలో అడవి ఆముదం కాయలను తిని చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
అడవి ఆముదం కాయలను తిన్నారు...అస్వస్థతకు గురయ్యారు