అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని సరస్వతీ విద్యా మందిరంలో... వసంతపంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో మొదట సరస్వతీ దేవి పూజ చేశారు. అనంతరం అర్చకులు చిన్నారుల నాలుకపై బీజాక్షరాలు రాశారు. విద్యార్థుల తల్లుల చేత బియ్యంలో అక్షరాభ్యాసం చేయించారు.
సరస్వతీ మందిరంలో సామూహిక అక్షరాభ్యాసం - సోమందేపల్లి లో అక్షరాభ్యాసం
వసంతపంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే... మంచిగా చదువుతారని తల్లిదండ్రుల నమ్మకం. అందుకే ఇవాళ పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేయిస్తారు.
సరస్వతీ మందిరంలో ...సామూహిక అక్షరాభ్యాసం
TAGGED:
సోమందేపల్లి లో అక్షరాభ్యాసం