చట్ట ప్రకారం నిర్ణీత వయసు లేకున్నా వివాహం చేయడానికి ఉపకరించిన పెద్దలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లా కుందుర్తి మండలంలోని ఓ గ్రామంలో 14 ఏళ్ల అమ్మాయికి వివాహం చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు పెళ్లిని ఆపేయించారు. అనంతరం వధూవరుల తల్లిదండ్రులను కుందుర్పి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. చట్టాన్ని అతిక్రమించి ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్సై నాగన్న హెచ్చరించారు.
అసలే లాక్ డౌన్... ఇప్పుడు బాల్యవివాహమా..? - girl child marrigae news in anantapur dst
లాక్డౌన్లో బయటకు రావద్దని అధికారులు మొత్తుకుంటుంటే... అనంతపురం జిల్లాలో మాత్రం 14ఏళ్ల అమ్మాయికి వివాహం చేయడానికి సిద్ధమయ్యారు ఆ తల్లిదండ్రులు. బాల్యవివాహం చేయటం చట్ట రిత్యా నేరమని పెళ్లిని ఆపించిన పోలీసులు... వధూవరుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు