ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పండగపూట విషాదం.. జలాశయంలో మునిగి చిన్నారి మృతి - జలాశయంలో మునిగి చిన్నారి మృతి

పండగపూట జలాశయంలో మునిగి పదేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటన అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం జీడిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కావన్య స్నేహితులతో కలిసి జీడిపల్లి జలాశయంలో స్నానానికి దిగి ప్రాణాలు విడించింది.

జలాశయంలో మునిగి చిన్నారి మృతి
జలాశయంలో మునిగి చిన్నారి మృతి

By

Published : Mar 2, 2022, 5:55 PM IST

అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం జీడిపల్లిలో పండగ పూట విషాదం నెలకొంది. జీడిపల్లి జలాశయంలో ప్రమాదవశాత్తు నీట మునిగి పదేళ్ల చిన్నారి మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినం తరువాత రోజు జలాశయంలో స్నానానికి వెళ్లటం గ్రామ ఆనవాయితీ. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన కావన్య తల్లిదండ్రులతో కలిసి జలశయానికి స్నానానికి వెళ్లింది. తోటి స్నేహితులతో ఆడుకుంటూ నీళ్లలోకి దిగింది. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో కావన్య నీటమునిగింది.

గమనించిన కావన్య స్నేహితులు ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పారు. వారు హుటాహుటిన చిన్నారిని బయటకు తీయగా.. అప్పటికే ఆమె మృతి చెందింది. దీంతో పండగపూట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details