అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం ఆర్డీటీ గృహాల వద్ద విషాదం జరిగింది. వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు వెళ్లిన 8మంది చిన్నారుల్లో...ప్రమాదవశాత్తు నాలుగురు చిన్నారులు బురదలో కురుకుపోయారు. స్థానికంగా పని చేస్తున్న కూలీలు గమనించారు. వెంటనే వసీం అనే వ్యక్తి.... నీటికిలోకి దిగి ముగ్గురు చిన్నారులను రక్షించాడు. మరో చిన్నారి కోసం లోపలికి వెళ్లే లోగా చిన్నారి నీటిలో పూర్తిగా మునిగిపోయింది. చాలాసేపు గాలించినా... ఆచూకీ దొరకలేదు. అప్రమత్తమైన కాలనీవాసులు చెక్ డ్యాం వద్దకు చేరుకున్నారు. అక్కడ చిన్నారి శిరీష(12) మృతదేహాం లభించింది. పోలీసులు, స్థానిక యువత దాదాపు రెండు గంటల పాటు శ్రమించి చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు.
చెక్‌డ్యాంలో పడి చిన్నారి మృతి - tadipatri latest news
వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నలుగురు చిన్నారులు నీటిలో పడిపోయారు. వీరిలో ముగ్గురిని రక్షించగా....ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన తాడిపత్రి ఆర్డీటీ గృహాల వద్ద జరిగింది.
నీటిలో మునిగి చనిపోయిన చిన్నారి శిరీష(12)