అనంతపురం జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి కాలనీ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కాలనీ సమీపంలో రోడ్డు దాటుతున్న నాలుగేళ్ల దేవాను.. వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తుంగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పట్నం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి - అనంతపురంలో రోడ్డు ప్రమాదం తాజా వార్తలు
రోడ్డు ప్రమాదానికి నాలుగేళ్ల చిన్నారి బలయ్యాడు. రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన బొలేరో వాహనం ఢీ కొట్టి.. బాబును బలి తీసుకుంది. ఈ విషాద ఘటన.. అనంతపురం జిల్లాలో జరిగింది.
రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి