నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి - నీటికుంట
నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఇటీవల కురిసిన వర్షాలకు కుంటలోకి భారీగా నీరు చేరింది. లోతును సరిగ్గా అంచనా వేయలేక చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఆమడుగూరులో చోటు చేసుకుంది.
child-dead
అనంతపురం జిల్లా ఆమడుగూరులో విషాదం చోటు చేసుకుంది. నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆమడుగూరు మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న కుంటలోకి నీరు భారీగా చేరింది. పదేళ్ల సుమంత్, ఎనిమిదేళ్ల సునీత్ ఆడుకునేందుకు కుంటలోకి దిగగా... లోతును సరిగ్గా అంచనా వేయలేక నీటిలో మునిగిపోయారు. చిన్నారులు కనపడకపోవటంతో తల్లిదండ్రులు అంతా గాలించటంతో... నీటి కుంటలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.