ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కియా ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ - కియా తాజా వార్తలు

అనంతపురం జిల్లాకు మణిమకుటంగా నిలిచే కియా కార్ల పరిశ్రమను ముఖ్యమంత్రి జగన్ తొలిసారి సందర్శించనున్నారు. కియా పరిశ్రమలోని అనుబంధ యూనిట్‌ను ముఖ్యమంత్రి నేడు  ప్రారంభించనున్నారు.

కియా ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్
కియా ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్

By

Published : Dec 5, 2019, 5:17 AM IST

అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ కియా పరిశ్రమలో అనుబంధ విభాగాన్నిఅనంతపురంలోముఖ్యమంత్రి జగన్ నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఫలితంగా కియా పరిశ్రమ తొలిసారిగా పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిశ్రమ అందుకోనుంది. తొలిసారి ప్లాంట్‌కు వస్తున్న సీఎంకు స్వాగతం పలికేందుకు కియా యాజమాన్యం, జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకొని...అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 11 గంటలకు కియా పరిశ్రమకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒకటిన్నర వరకూ అన్ని విభాగాలను పరిశీలించనున్నారు.

భారీ బందోబస్తు

అనంతరం ప్రభుత్వం ఆలోచనలను వివరించనున్నారు. ఈ క్రమంలో 15 వందల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి శంకర నారాయణ, జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు.

వెనుకబడిన ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయటం, స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాల కల్పన చట్టం అమలే ధ్యేయమని ప్రభుత్వం పేర్కొంది. కియా కార్ల కర్మాగారం ద్వారా 4 వేల శాశ్వత, 7 వేల తాత్కాలిక ఉద్యోగాల కల్పన జరగనుందని వెల్లడించింది.

కియా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా స్థానిక యువతలో నైపుణ్యాలు పెంచేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో కియా కలిసి పని చేస్తోందని వెల్లడించింది. ఇప్పటి వరకూ 12 వేల 835 మందికి కియా ఉపాధి కల్పించగా... అందులో 10 వేలమంది రాష్ట్రానికి చెందినవారేనని స్పష్టం చేసింది. అందులోనూ 7వేల 29మంది అనంతపురం వాసులు ఉ‌న్నట్లు తెలిపింది. అనంతపురం జిల్లాలోనే త్వరలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ వీరా వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ వెయ్యి కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేయనుందని వెల్లడించింది.

ఇదీచదవండి

సీఎం జగన్​కు ఏఎస్పీలు ధన్యవాదాలు

ABOUT THE AUTHOR

...view details