మగ్గాల యజమాని ఆదిరెడ్డి వద్ద చేనేత కార్మికుడు చంద్రశేఖర్ 30 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. సమయానికి డబ్బులు సర్దుబాటు కాక తిరిగి చెల్లించలేకపోయాడు. ఈ కోపంతో చంద్రశేఖర్‌పై ఆదిరెడ్డి అతని బంధువు సాయినాథ్ రెడ్డితో కలిసి దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన చేనేత కార్మికుడు.. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణ... కార్మికుని కుటుంబాన్ని పరామర్శించారు. దాడి చేసిన వారిపై అనంతపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అప్పు తీర్చలేదని కార్మికుడు ప్రాణం తీసిన యజమాని
అనంతపురం జిల్లా ధర్మవరం పార్థసారథి నగర్లో చేనేత కార్మికుడు మరణించాడు. అప్పు తిరిగి చెల్లించలేదన్న ఆగ్రహంతో మగ్గాల యజమాని చేసిన దాడిలో ఆయన మృతి చెందాడు.
అప్పు తీర్చలేదని కార్మికుడు ప్రాణం తీసిన యజమాని
ఇవీ చదవండి..