అనంతపురం జిల్లా ఉరవకొండలోని వజ్రకరూర్ మండలంలో చిరుతల సంచారంతో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. గూళ్యపాళెం గ్రామంలో రెండు చిరుతలు గొర్రెలమందపై దాడి చేసి మూడు గొర్రెలను చంపి తిన్నాయి. నాలుగేళ్ల క్రితం కూడా చిరుత ఇలాగే తమ గ్రామంలో ప్రవేశించి.. 11 మందిని తీవ్రంగా గాయపరిచిందని గ్రామస్థులు వాపోయారు. మరోసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా అటవీ అధికారులు స్పందించి.. తమకు, తమ పశువులకు రక్షణ కల్పించాలని కోరారు.
చిరుతల సంచారం... భయాందోళనలో గ్రామస్థులు - ఈటీవీ భారత్ తాజా వార్తలు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గూళ్యపాళెం గ్రామంలోకి ప్రవేశించిన రెండు చిరుతలు గొర్రెల మందలపై దాడిచేసి.. మూడు గొర్రెలను చంపి తినడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. అటవీ అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
చిరుతల సంచారం... భయాందోళనలో గ్రామస్థులు