cheetah's wandering: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి గ్రామంలో.. చిరుతల సంచారం కలకలం రేపుతోంది. సమీపంలోని గుట్టపై 4 చిరుతలు సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గుట్టపక్కన వ్యవసాయం చేస్తున్న రైతులు.. చిరుతలను గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు.
cheetah's wandering: అక్కడ చిరుత పులుల సంచారం.. భయాందోళనలో స్థానికులు - ap latest news
cheetah's wandering: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి గ్రామం సమీపంలోని.. కొండపై చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. గుట్టపక్కనున్న పొలాల యజమానులు.. నాలుగు చిరుతలను గమనించి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు.
గూబనపల్లి సమీపంలో చిరుత పులుల సంచారం
వారు అక్కడకు చేరుకుని శుక్రవారం రాత్రి నుంచి గస్తీ చేపడుతున్నారు. చిరుతలు సంచరిస్తున్న గుట్టకు ఆనుకునే.. ఓ పాఠశాల ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతలను బోన్‌లో బంధించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
farmers padayatra: అడుగడుగునా జన నీరాజనం..ఉత్సాహంగా రైతుల పాదయాత్ర