ప్రవల్లిక అనే మహిళ 500 మందితో చీటీలు వేయించి తిరిగి ఇవ్వకుండా మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అనంతపురం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఒక్కో సభ్యురాలికి 4 నుంచి 5 లక్షల వరకు రావాలని వాపోయారు. నమ్మి చీటీలు వేస్తే మోసం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని బాధితులు అంటున్నారు. విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని సీఐ రెడ్డప్ప తెలిపారు.
చీటీల పేరుతో మోసం... ధర్నాకు దిగిన మహిళలు - చీటీల పేరుతో మోసం చేసిన మహిళ అనంతపురం
చీటీల పేరుతో ఓ మహిళ మోసానికి పాల్పడింది. దాదాపు 500 మందిని నమ్మించి మోసం చేసిన ఘటన అనంతపురంలో జరిగింది.

చీటీల పేరుతో మోసం...దర్నాకు దిగిన మహిళలు
లబోదిబోమంటున్న మోసపోయిన మహిళలు
ఇదీ చూడండి