అనంతపురం జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన లేపాక్షి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ రథోత్సవం జరిగింది. దుర్గా, పార్వతీ సమేత పాపనాశేశ్వర స్వామి వార్లను ప్రత్యేకంగా అలంకరించి.. అశేష భక్త జనం నడుమ లేపాక్షి ప్రధాన వీధుల్లో ఊరేగించారు. శివనామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. రథోత్సవానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
కన్నుల పండువగా లేపాక్షి ఆలయ రథోత్సవం - mahashivaratri celebrations in lepakshi news
అనంతపురం జిల్లా లేపాక్షి దుర్గా పాపనాశేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆలయ రథోత్సవం కన్నుల పండువగా సాగింది.
లేపాక్షి ఆలయ రథోత్సవం