అనంతపురం జిల్లా మాజీ మేయర్ స్వరూప అమరావతిలో జరిగిన అభివృద్ధిని ఈటీవీ, ఈనాడు, ఈటీవీ భారత్ తమ కథనాల ద్వారా కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయని అనంతపురం జిల్లా మాజీ మేయర్ స్వరూప అన్నారు. ప్రస్తుతం పరిస్థితిని చూస్తే... రాష్ట్రం ఏమవుతుందోనని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని ఆమె తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచస్థాయి రాజధాని నిర్మించాలని... ఇంత అభివృద్ధిని సకాలంలో 75 శాతం పూర్తి చేస్తే.. వైకాపా ప్రభుత్వం ఇలా రాజధానిని మార్చడం ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు.
తెదేపాపై కక్షతోనే
రాష్ట్ర పరిస్థితులపై ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని స్వరూప విమర్శించారు. తెదేపా నాయకులపై కోపంతోనే రాజధాని మార్పు చేయాలని చూస్తున్నారని... అలా కాకుండా ప్రజల కోసం ఆలోచించి రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అమరావతిలో జరిగిన అభివృద్ధి నిర్మాణాలపై ఈటీవీ భారత్లో వస్తున్న కథనాలను ఆమె అభినందించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రాష్ట్ర రాజధాని మార్పును ఉపసంహరించుకోవాలని కోరారు.
ఇవీ చదవండి:
అమరావతిని మార్చకపోతే విప్లవం వస్తుంది:అవంతి