అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ గవిమఠం చంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి బసవేశ్వర వాహనోత్సవం ఘనంగా జరిగింది. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని బసవేశ్వరుడిపై ఉంచి ఊరేగించారు. ఈ కార్యక్రమంలో గవిమఠం పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్ర స్వామి, ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్రస్వామి, ఆదోని చౌకిమఠం కల్యాణి స్వామి, వీరశైవ సంఘం సభ్యులు, మఠం అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. వీరశైవ లింగాయతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఉరవకొండలో వైభవంగా చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - Chandramouleshwara Swamy Brahmotsavalu news
అనంతపురం జిల్లా ఉరవకొండలో చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదవ రోజు స్వామి వారిని బసవేశ్వర వాహనంపై ఊరేగించారు. గవిమఠం పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్రస్వామి ఈ వేడుకలో పాల్గొన్నారు.
చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు