ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Chandra Dandu: 'నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది' - చంద్రదండు న్యూస్

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని ప్రభుత్వ శాఖలను భ్రష్టు పట్టించారన్నారని చంద్రదండు(Chandra Dandu) రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడు విమర్శించారు. ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు.

chandradandu fire on ycp govt over unemployment
నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది

By

Published : Jun 27, 2021, 3:31 PM IST

నిరుద్యోగుల జీవితాలతో వైకాపా ప్రభుత్వం చెలగాటమాడుతోందని చంద్రదండు(Chandra Dandu) రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడు మండిపడ్డారు. అనంతపురంలో టవర్ క్లాక్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రదండు కార్యకర్తలు నిరసన చేపట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని ప్రభుత్వ శాఖలను భ్రష్టు పట్టించారన్నారు. కేవలం తమ కార్యకర్తలతో వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి అవినీతి పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలకు ఉద్యోగాలు రాక తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవటం ఆక్షేపించారు.

తెదేపా అధికారంలో ఉన్నప్పుడు 27 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని ప్రకాశ్ నాయుడు స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా..అంగన్​వాడీ సంస్థలను నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వామపక్ష పార్టీలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details