Chandrababu wrote a letter to CS: అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఇసుక దందా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులను, వంకలను, నదులను వదలకుండా వారి దందా కోసం ఇసుకను కొల్లగొడుతున్నారు. అంతేకాదు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే పెన్నా నది గర్భాన్ని సైతం పెకలించి, ఇష్టారీతిగా ఇసుకను తరలిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసారు.
రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలపై పలుమార్లు గతంలో ఫిర్యాదు చేశామని గుర్తు చేసారు. అయినా ఆ ఫిర్యాదులపై తగు రీతిలో స్పందించి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. అధికార వైఎస్సార్‌సీపీ నేతలతో ఓ వర్గం అధికారులు కుమ్మక్కై ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అనుమతించిన దానికి మించి.. జయప్రకాష్ వెంచర్స్ ఇసుక తవ్వకాలకు చేస్తోందని ధ్వజమెత్తారు.
కోర్టు ఆదేశాలు ఉన్నా తవ్వకాలు ఆగడం లేదు.. ఇక్కడ అక్రమ తవ్వకాలపై హైకోర్టులో కూడా విచారణ జరిగిందని తెలిపారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి), ఇతర కోర్టుల నుండి అనేక ఆదేశాలు ఉన్నప్పటికీ, ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టలేదని ఆగరహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారిపై దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. అక్రమాలను అరికట్టడంలో ప్రభుత్వ శాఖలు, అధికారులు విఫలం అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఇష్టారీతిన ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం జరగుతుందన్నారు. పరిస్థితి చేయిదాటిపోకముందే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను తక్షణమే అరికట్టడంతోపాటు సహజ వనరులను కాపాడుకోవడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.
ఇసుక అక్రమ రవాణాపై సీఎస్‌కు చంద్రబాబు లేఖ రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై పలుమార్లు ఫిర్యాదు చేశాం.. అయినప్పటికీ స్పందించలేదు.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు పెద్దపప్పూరు మండలం పెన్నా నదిలో తవ్వకాలు జరుపుతున్నారు.. అధికార పార్టీ వైసీపీ నేతలతో ఓ వర్గం అధికారులు కుమ్మక్కయ్యి.. ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతున్నారు. అక్కడు అనుమతికి మించి.. జయప్రకాష్ వెంచర్స్ ఇసుక తవ్వకాలు చేస్తోంది. ఎన్జీటీ, కోర్టుల నుంచి ఆదేశాలున్నా అక్రమ తవ్వకాలపై కనీస చర్యలు తీసుకోలేదు. పైగా తవ్వకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారిపై దాడులు చేస్తున్నారు. అక్రమాలను అరికట్టడంలో ప్రభుత్వ శాఖలు, అధికారులు విఫలం అయ్యారు. ఇలా ఇష్టారీతిన ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం నష్టం కలుగుతుంది. పరిస్థితి చేయిదాటి పోకముందే సహజ వనరులను కాపాడుకోవాలి.- చంద్రబాబు లేఖలో ప్రస్తావించిన అంశాలు..
ఇవీ చదవండి: