తెదేపా జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటన ముగిసింది. నిన్న రాత్రి అనంతపురంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేసిన ఆయన ఉదయం 6 గంటలకు బెంగళూరుకి బయలుదేరి వెళ్లారు. అక్కడ నుంచి గన్నవరం చేరుకోనున్నారు. తెదేపా జిల్లా నేతలు పరిటాల సునీత, పార్థసారథి, ప్రభాకర్ చౌదరి, యామిని బాల, పల్లె రఘునాథ్ రెడ్డి, బండారు శ్రావణి, పరిటాల శ్రీరామ్, ఉమామహేశ్వర నాయుడు, పార్టీ శ్రేణులు చంద్రబాబును కలిశారు.
ముగిసిన...చంద్రబాబు అనంతపురం పర్యటన - anatapur tour
తెదేపా అధినేత చంద్రబాబు అనంతపురం పర్యటన ముగిసింది. పర్యటన అనంతరం ఈ ఉదయం చంద్రబాబు..బెంగళూరు బయలుదేరి వెళ్లారు. అధినేతకు మార్గమధ్యలో శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పలువురు నేతల చంద్రబాబును గౌరవసూచకంగా కలుసుకున్నారు.
చంద్రబాబు అనంతపురం పర్యటన
చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనలో ముగించుకుని బెంగళూరు ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా మార్గమధ్యలో పెనుగొండ తెదేపా నాయకులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. పలువురు తెదేపా నాయకులు చంద్రబాబుకు పుష్ప గుచ్ఛాలు అందజేశారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి జిల్లా పర్యటనకు రావాలని కోరారు.
ఇదీ చదవండి :సీఎం జగన్ చాలా గ్రేట్ : తెదేపా ఎంపీ కేశినేని నాని