డిసెంబర్ 18, 19, 20న అనంతపురంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి తెలిపారు. అనంతపురంలోని బళ్లారి బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ లో మూడు రోజులపాటు సమీక్షలు నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, అనంతపురం మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి వెల్లడించారు. వైకాపా ఆరు నెలల పాలన, తెదేపా కార్యకర్తలపై దాడులపై సమీక్షలో చంద్రబాబు ప్రస్తావించనున్నట్లు కాల్వ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేయనున్నట్లు పేర్కొన్నారు.
18 నుంచి అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన - అనంతపురంలో చంద్రబాబు పర్యటన న్యూస్
తెదేపా జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురంలో పర్యటించనున్నారు. మూడు రోజులపాటు పార్టీ జిల్లా నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు.
chandrababu tour in ananthapuram