గ్రామస్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణమే ధ్యేయంగా జిల్లాల పర్యటనలు చేస్తున్న చంద్రబాబు... నేటి నుంచి 3 రోజులపాటు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం పట్టణంలోని ఓ పంక్షన్ హాల్‌కి చేరుకోనున్న ఆయన... ముందుగా పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. అనంతరం నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు.
మొదటి రోజు నాలుగు, రెండో రోజు 6, మూడో రోజు మిగిలిన 4 నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైకాపా బాధితులను చంద్రబాబు కలుస్తారని జిల్లా పార్టీ అధ్యక్షుడు పార్థసారథి చెప్పారు. వారికి అండగా ఉంటామని భరోసా కల్పిస్తారని వివరించారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు మరో నేత కాలవ శ్రీనివాసులు తెలిపారు.