అనంతపురం జిల్లా రాయదుర్గంలో అపహరణకు గురైన సర్పంచ్ అభ్యర్థి ఈరన్నను.. తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. అపహరణకు గురైన ఘటన గురించి.. ఈరన్న చంద్రబాబుకు వివరించారు. పోటీచేస్తే చంపేస్తామని వైకాపా వర్గీయలు బెదిరించినట్లు తెలిపారు.
రాయదుర్గంలో వైకాపా దౌర్జన్యాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యంగా నామినేషన్ వేయాలని.. తనకు తెదేపా అండగా ఉంటుందని ఈరన్నకు హామి ఇచ్చారు.