అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, పార్టీ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.
నిరాడంబరంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు - ananthapuram district
అనంతపురంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా జరిపారు.
![నిరాడంబరంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ananthapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6865243-549-6865243-1587367308149.jpg)
నిరాడంబరంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు