అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు.. తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవే పరమావధిగా కొనసాగుతున్న ప్రయాణంలో.. మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి మీరు చేస్తున్న కృషి, ప్రజా సమస్యలపై మీ పోరాటం.. ఎందరికో ఆదర్శమని నారా లోకేష్ ట్వీట్ చేశారు. సొంత నియోజకవర్గంలోని ఆయన అభిమానులు, పట్టణ తెదేపా నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు చంద్రబాబు, లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు - ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు చంద్రబాబు, లోకేష్ ట్వీట్
ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. ప్రజాసేవలో మరింత ఎత్తుకు ఎదగాలని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని నారా లోకేష్ కొనియాడారు.
ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు చంద్రబాబు, లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు