CBN FIRES ON CM JAGAN IN COUNCILORS MEETING : జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో అసహ్యం ప్రారంభమైందని.. ఆ భయంతోనే పరదాల కట్టుకుని సీఎం పర్యటనలు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సీఎం సభలకు బలవంతంగా ప్రజల్ని కూర్చోపెడుతున్నా.. గోడలు దూకి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో తాడిపత్రి కౌన్సిలర్లతో చంద్రబాబు సమావేశమయ్యారు. తన కర్నూలు పర్యటనతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని.. మరో 3జిల్లాలు తిరిగితే ఆ పార్టీ మొత్తం బిస్తర సర్దేస్తారని ఎద్దేవా చేశారు.
రాక్షసుడు సీఎం అయి ఉన్మాద పాలన సాగిస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య ప్రజా సేవకుడిగా కాకుండా ఓ డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతీకార కాంక్షను పెంచేలా అరాచక పాలన చేస్తుండటం సమాజానికి మంచిది కాదని హెచ్చరించారు. తాడిపత్రి కౌన్సిల్ మీటింగ్ పోలీస్ స్టేషన్లో పెట్టుకునే దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.