ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎందుకిలా చిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు' - CM JAGAN

వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్​ వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఎందుకిలా చిరుద్యోగుల ఉసురు పోసుకుంటోందని ప్రశ్నించారు.

తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్

By

Published : Jul 27, 2019, 9:16 PM IST

ప్రభుత్వం ఎందుకిలా చిరుద్యోగుల ఉసురు పోసుకుంటోందని తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్‌లో ప్రశ్నించారు. చిరుద్యోగుల ఆవేదనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన చంద్రబాబు... నిన్న ఆశాకార్యకర్తలు, ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు... ఏమిటీ రౌడీరాజ్యం అంటూ నిలదీశారు. వైకాపా వాళ్లకు ఉద్యోగాలివ్వాలంటే ఇంకొకరి ఉద్యోగాలను తొలగించాలా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు సృష్టించే సమర్థత లేనప్పుడు ఏం చేద్దామని హామీలిచ్చారని ధ్వజమెత్తారు.

తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్

ABOUT THE AUTHOR

...view details