ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ... అనంతపురంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవర్ల మురళి హోమం నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య హోమ కత్రువును పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలనే తనతోపాటు రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు.
చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని.. గణపతి హోమం - anantapur
చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ అనంతపురంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించారు.
చంద్రబాబు సీఎం కావాలని కోరుతూ.. గణపతి హోమం