మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం పర్యటనపై జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పార్థసారథితో ఫోన్లో చర్చించారు. ఇవాళ మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పార్థసారథికి చంద్రబాబు ఫోన్ చేశారు. కొంతసేపు వరకు వారిద్దరి మధ్య ఆసక్తికర సంబాషణ నడిచింది. ఈ నెల8న జిల్లాలో చంద్రబాబు పర్యటించాల్సి ఉండగా... దానిని 9 వాయిదా వేసుకోవాల్సిందిగా చంద్రబాబుకు పార్థసారథి సూచించారు. అలాగే పరిటాల శ్రీరామ్ని ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా నియమించే విషయమై పార్టీ అధినేతతో చర్చించారు. ఆ నియోజకవర్గ ప్రజలు శ్రీరామ్ని పార్టీ ఇన్ఛార్జిగా చేయాలని కోరుతున్నారని పార్థసారథి చంద్రబాబుకు తెలిపారు.
అనంత తెదేపా అధ్యక్షుడికి చంద్రబాబు ఫోన్ - phone call
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు పార్థసారథికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. ఈ నెల 8న జిల్లా పర్యటన, ధర్మవరం ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ నియామకం వంటి విషయాలు చర్చించారు.
పార్థసారథికి చంద్రబాబు ఫోన్