అనంతపురంలోని చాందిని మసీదులో చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 17న మసీదులోని హుండీని పగులగొట్టి అందులో ఉన్న నగదును అపహరించాడు. నిఘానేత్రాల ఆధారంగా పోలీసులు దొంగను గుర్తించారు. అతని నుంచి రూ.14,750 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలోనూ పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు వివరించారు.
చాందిని మసీదులో చోరీ కేసు నిందితుడు అరెస్ట్ - చోరీ కేసు నిందితుడు అరెస్ట్
చాందిని మసీదులో చోరీ చేసిన దొంగను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి రూ. 14,750 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని గుర్తించడంలో నిఘానేత్రాలు కీలక పాత్ర పోషించాయి.
chandini-