ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హోదా సాధనతోనే రాష్ట్రాభివృద్ధి: చలసాని శ్రీనివాస్ - ఏపీకి ప్రత్యేక హోదా వార్తలు

గతంలో హోదా కోసం పోరాడిన వైకాపా.. ఇప్పుడూ అదే స్ఫూర్తితో ముందుకు నడవాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ కోరారు. ఈ అంశంపై అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

chalasani srinivas comments  on_Special Status to andhrapradesh
chalasani srinivas comments on_Special Status to andhrapradesh

By

Published : Feb 18, 2020, 12:00 PM IST

మీడియా సమావేశంలో చలసాని శ్రీనివాస్

ప్రత్యేక హోదా సాధనకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ కోరారు. గతంలో తాము ప్రత్యేక హోదా సాధన కోసం చేసిన ఉద్యమంలో వైకాపా కలిసి వచ్చిందని, అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్ అఖిలపక్ష పార్టీలతో కూటమి ఏర్పాటు చేయాలని చెప్పారు. హోదా సాధించకుండా, పెద్ద ఎత్తున రాయితీలు ప్రకటించకుండా ఏ పరిశ్రమ రాష్ట్రానికి రాదన్న విషయం ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో 75 శాతం ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం.. తెలుగు రాష్ట్రాల యువత భవిష్యత్ కు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో కరవు నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

ABOUT THE AUTHOR

...view details