Chain snatching In Anantapur: పట్టపగలే రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్ మహిళ మెడలోంచి 40 గ్రాముల బంగారు గొలుసు దోచుకెళ్లారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలం జల్లపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అమృత అనే మహిళ తన కూతురుతో కలిసి ఒంటరిగా వెళుతోంది. గమనించిన ఇద్దరు దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి చంపేస్తామని కత్తిని చూపుతూ ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Chain Snatching: కత్తి చూపి.. చంపుతామని బెదిరించి చైన్ స్నాచింగ్
Chain snatching In Anantapur: రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట చైన్‌స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. మహిళలు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా... ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలు బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
పట్టపగలే రెచ్చిపోయిన చెన్స్నాచర్స్