ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గ్రామ సచివాలయ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి' - అనంతపురం తాజా వార్తలు

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో నిర్మిస్తున్న గ్రామ సచివాలయ భవనాన్ని జిల్లా పరిషత్ జడ్పీ సీఈఓ శోభ స్వరూపరాణి సందర్శించారు. అనంతరం ఇంచార్జ్ ఎంపీడీఓ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

ceo shoba rani checking the new building
గ్రామ సచివాలయ భవనాన్ని పరిశీలించిన సిఈఓ శోభ స్వరూపరాణి

By

Published : Dec 4, 2020, 4:36 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని నింబగల్లు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయ భవనాన్ని జిల్లా పరిషత్ జడ్పీసీఈఓ శోభ స్వరూపరాణి సందర్శించారు. అలాగే నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇంచార్జ్ ఎంపీడీఓ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. విధినిర్వహణకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం రేణుమాకులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details