'అనంతపురం జిల్లాలో నీటి నిలువ ఎలా?'
జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా అనంతపురం జిల్లాలో కేంద్ర అధికారులు పర్యటించారు. తరచూ కరవు ఎదుర్కొంటున్న జిల్లాలో నీటి వనరుల వినియోగం, నిల్వ ఉంచుకునే విధానాన్ని పరిశీలించారు.
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో కేంద్ర బృందం పర్యటించింది. జిల్లాలో తరచూ తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదురవుతున్నందున సమస్యను అధిగమించేందుకు క్షేత్రస్థాయిలో ఉన్నతస్థాయి అధికారుల బృందం 3 రోజులుగా పర్యటిస్తోంది. నీటి వనరుల సద్వినియోగం, వర్షపునీటిని నిల్వ ఉంచుకొనే విధానంలో ప్రజలు అనుసరిస్తున్న పద్ధతులను అధికారులు పరిశీలించారు. జలశక్తి అభయాన్ కార్యక్రమంలో భాగంగా.. కరువు ప్రాంతాల్లో పర్యటించి... నీటిని సద్వినియోగం చేసుకునేలా అనుసరించాల్సిన పద్ధతులపై సమగ్ర నివేదికను రూపొందించనున్నట్టు తెలిపారు. జిల్లాలోని అధికారులకు ఈ దిశగా సూచనలు చేశారు. నవంబర్‌లోపు జిల్లాలో మరికొన్నిసార్లు పర్యటిస్తామని... అధికారులు తీసుకున్న చర్యలను పరిశీలిస్తామని వెల్లడించారు.