పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పూర్తిగా అవగాహన లేకుండా ఆందోళన చేస్తున్నారంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అనంతపురంలో నిర్వహిస్తున్న ఏబీవీపీ 38వ రాష్ట్ర మహాసభలకు కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సీఏఏపై అవగాహన కల్పించారు. దేశంలో 70 సంవత్సరాలుగా పరిష్కారం కాని అనేక సమస్యలు ఈ ఐదేళ్లలో పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. సీఏఏ వల్ల దేశంలో ఏ ఒక్కరికీ నష్టం కలగదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు ధర్నాలు, ఆందోళనలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. దేశంలో అరాచకాలు స్పష్టించి కొన్ని రాజకీయ పార్టీలు, మతోన్మాద సంస్థలు ఆనందం పొందుతున్నాయని ఆరోపించారు. మతం పేరుతో దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయంగా భాజపాను ఎదుర్కోలేకే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. దేశ పౌరులందరూ బాధ్యతగా మసులుకోవాలని సూచించారు.
'సీఏఏ వల్ల దేశంలో ఎవ్వరికీ నష్టం కలగదు'
సీఏఏ వల్ల భారతీయులకు ఎలాంటి నష్టం జరగదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దీనిపై అసత్య ప్రచారం చేస్తూ విపక్షాలు దేశంలో అరాచకాలు స్పష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. మతం పేరుతో ప్రజలను రోడ్లపైకి తీసుకొస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కిషన్ రెడ్డి