ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజాస్వామ్య హక్కులకు కేంద్రం భంగం కలిగిస్తోంది' - ప్రజాస్వామ్య హక్కులకు కేంద్ర ప్రభుత్వం భంగం కలిగిస్తోంది

కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తప్పుబట్టింది. ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించే విధంగా పని చేస్తోందని ఆరోపించింది.

central government is violating democratic rights says pdsu members
ప్రజాస్వామ్య హక్కులకు కేంద్ర ప్రభుత్వం భంగం కలిగిస్తోంది

By

Published : Jul 29, 2020, 1:12 PM IST

ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాలను అవలంబిస్తోందని... ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకులు ఆరోపించారు. అనంతపురంలో ప్రజా సంఘాలతో పీడీఎస్​యూ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న వరవరరావు, సాయిబాబా లాంటి వారిని అక్రమంగా అరెస్టు చేశారన్నారు.

అలాంటి వారిని ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న మత వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు అరెస్టులు చేయడం ఏంటని మండిపడ్డారు. వరవరరావు, సాయి బాబాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం కల్పించి వ్యతిరేకత చాటుతామని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details