గ్రామాలను పరిశుభ్రంగా మార్చి, అక్కడి చెత్తతో సంపద తయారు చేసే ప్రతిపాదనతో గత ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని పలు గ్రామాల్లో సంపద తయారీ కేంద్రాలను నిర్మించింది. ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామ జనాభాను బట్టి వీటి నిర్మాణం చేపట్టారు. గ్రామంలో సేకరించిన చెత్తను వేరుచేసి ఎరువుగా మార్చి స్థానికంగా ఉన్న రైతులకు విక్రయించాలనేది ఈ పథకం ఉద్దేశం. జిల్లావ్యాప్తంగా రూ.33 కోట్ల 19 లక్షల వ్యయంతో 786 షెడ్లను పూర్తిస్థాయిలో నిర్మించారు. 6నెలల క్రితమే ఇవన్నీ అందుబాటులోకి వచ్చినప్పటికీ... సంపద తయారీకి అధికారులు ప్రయత్నించకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయని రైతులు వాపోతున్నారు.
బిల్లులు మంజూరు కాలేదు...
అటు షెడ్ల నిర్మాణం పూర్తైనప్పటికీ ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాలేదు. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గుత్తేదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.