ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కియాపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి: చంద్రబాబు - కియా ముట్టడి

కియా పరిశ్రమ సందర్శనకు వెళ్తున్న సీపీఐ నేతలను ఇవాళ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అరెస్టు చేయడానికి వారు ఏమైనా నేరస్థులా అని ప్రశ్నించారు. అలాగే కియా పరిశ్రమపై వస్తోన్న వార్తల్లో నిజాలు ప్రజలకు తెలియాలని స్పష్టం చేశారు.

chandra babu
chandra babu

By

Published : Feb 12, 2020, 9:56 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్

అనంతపురం జిల్లాలో సీపీఐ నేతల గృహ నిర్బంధాన్ని, అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. 'కియా పరిశ్రమకు వెళ్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కారును పోలీసులు వెంబడించి మరీ... ఆయనను అరెస్టు చేయడం ఏమిటి? ఆయనేమైనా నేరస్థుడా? అనంతపురం జిల్లాలో సీపీఐ నేతల గృహ నిర్బంధాన్ని, అరెస్టులను ఖండిస్తున్నాను. కియా పరిశ్రమ గురించి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిందే. కియా తమిళనాడుకు తరలిపోతుందని వార్త రావడం, ఆ వెంటనే కియా ప్రతినిధులతో వైకాపా నేతలు ఇది నిజం కాదని చెప్పించడం. మరుసటి రోజే తాము రాసింది నిజమే అంటూ ఆ జాతీయ మీడియా చెప్పడం... ఏమిటివన్నీ? తెరవెనుక జరిగింది ఏమిటి? కియా సంస్థను ఎవరు బెదిరించారు? ఎవరు వేధించారు? వార్తల్లో నిజా నిజాలేమిటి? ప్రజలకు తెలియొద్దా? వాస్తవాలను నిర్ధరించుకోడానికి వెళ్తున్న నేతలను అరెస్టు చేశారంటే... ఇందులో ప్రభుత్వం దాస్తున్న అంశాలేమిటి? ప్రభుత్వం వెంటనే సీపీఐ నేతలను విడుదల చేయాలి' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details