CBI officials came to Gangula Kamalakar house: మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. అక్కడ గంగుల లేకపోవడంతో.. ఆయన కుటుంబ సభ్యులతో అధికారులు మాట్లాడి వివరాలు సేకరించారు. రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతి లేకున్నా ఇటీవల ఓ వ్యక్తి సీబీఐ నుంచి వచ్చానంటూ మంత్రి ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. ఆయన నకిలీ సీబీఐ అధికారి అని ఆ తర్వాత తేలింది. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు ఇవాళ గంగుల ఇంటికి వెళ్లి ఆరా తీశారు. సదరు వ్యక్తి ఏయే వివరాలు అడిగారనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.
మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రకు సీబీఐ నోటీసులు - మంత్రి గంగుల
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు, ఎంపీ రవిచంద్రకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతి లేకున్నా ఇటీవల ఓ వ్యక్తి సీబీఐ నుంచి వచ్చానంటూ మంత్రి ఇంటికి వెళ్లినట్లు తెలిసింది.
అనంతరం గంగుల కమలాకర్‌కు, ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. రేపు దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి రావాలని అందులో పేర్కొన్నారు. సీబీఐ అధికారులు రాకముందే మంత్రి కమలాకర్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లారు. గంగుల కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్స్‌కు సంబంధించి విదేశీమారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని (ఫెమా) ఉల్లంఘించారన్న ఆరోపణలపై కొద్దిరోజుల క్రితం ఈడీ అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: