ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మట్టిని తరలిస్తే.. కేసులా..?'

పొలాల్లోని నల్లమట్టిని తరలిస్తుండగా పోలీసులు తమపై కేసులు నమోదు చేశారని అనంతపురం జిల్లా విడపనకల్ మండలం కొట్టాలపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Cases Registered on farmers to transport sand in ananthapuram district
పోలీసులు స్వాధీనం చేసుకున్న మట్టి ట్రాక్టర్లు

By

Published : Jun 4, 2020, 7:03 PM IST

ఎరువు కోసం తమ పొలంలో ఉన్న నల్ల మట్టిని తీసుకొని వెళ్తుండగా.. స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ పోలీసులు అరెస్టు చేసి ట్రాక్టర్లను సీజ్ చేశారని అనంతపురం జిల్లా విడపనకల్ మండలం కొట్టాలపల్లి రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. వరదల ద్వారా పొలాల్లో ఉన్న నల్లమట్టి వంకల్లోకి వస్తుందని.. ఆ మట్టినే ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నామని రైతులు తెలిపారు. ఇంత చిన్న విషయానికే పోలీసులు కేసు నమోదు చేశారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details